విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. అయితే కళ్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు సైమా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా పురస్కారం కూడా అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. టీవీ సీరియళ్ల దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది. నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన కన్నడ బ్యూటీ రచితా రామ్ హీరోయిన్గా నటిస్తుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: