వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ సంగీత దర్శకుడు థమన్… ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు స్వరాలు సమకూరుస్తున్నాడు. ఆ చిత్రాలే… ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘ప్రతి రోజూ పండగే’, ‘అల వైకుంఠపురములో’. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ నాలుగు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా మూడు వేర్వేరు పండుగలకి విడుదల కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. దీపావళి కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుండగా… అదే సీజన్ లో మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కలయికలో రూపొందుతున్న ‘ప్రతి రోజూ పండగే’ కూడా రిలీజ్ కానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.
మరి… మూడు వేర్వేరు ఫెస్టివల్ సీజన్స్‌లో రానున్న ఈ నాలుగు చిత్రాలతో థమన్ ఏ స్థాయి విజయాలను అందుకుంటాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: