తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ… కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ శైలే వేరు. అలా ఆయన తెరకెక్కించిన చిత్రాలలో… బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలచింది `నిన్నే పెళ్ళాడతా`. ‘కింగ్’ నాగార్జున, టబు జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో… లక్ష్మి, చలపతిరావు, చంద్రమోహన్, కవిత, ‘ఆహుతి’ ప్రసాద్, మంజుభార్గవి, బెనర్జీ, సన, గిరిబాబు, ఉత్తేజ్, బ్రహ్మాజీ, రమాప్రభ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ గీత రచనలో… సందీప్ చౌతా స్వరపరిచిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “ఎటో వెళ్లిపోయింది మనసు”, “గ్రీకు వీరుడు”, “కన్నుల్లో నీ రూపమే”, “ఇంకా ఏదో”, “నిన్నే పెళ్ళాడేస్తానంటూ”, “నాతోరా”, “నా మొగుడు రామ్‌ప్యారి”… ఇలా ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం… నాగ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలచిపోయింది. అలాగే ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1996 అక్టోబర్ 4న విడుదలై ఘన విజయం సాధించిన ‘నిన్నే పెళ్ళాడతా’… నేటితో 23 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: