సినీ , నాటక రంగాలలో రాణించిన ప్రముఖ నటుడు దామరాజు వెంకట లక్ష్మీ నరసింహా రావు (79) బుధవారం రాత్రి హైదరాబాద్ లో కన్ను మూశారు. ప్రముఖ దర్శకుడు, నాటక రంగ పితామహుడు చాట్ల శ్రీరాములు శిష్యుడు దామరాజును దర్శకరత్న దాసరి తాత మనవడు మూవీ తో సినీరంగానికి పరిచయం చేశారు. దామరాజు పలు చిత్రాలలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రుతు రాగాలు, ఆనంద ధార , చదరంగం, అన్వేషిత తదితర టివి సీరియల్స్ లో నటించి దామరాజు బుల్లితెర పై తనదైన ముద్ర వేశారు . రచయితగా పలు నాటకాలు రచించి, దర్శకత్వం వహించారు. నాటక రంగం లో ఉత్తమ రచయిత, హాస్యనటుడు, దర్శకుడిగా అవార్డ్స్ అందుకొన్నారు. RTC లో పదవీ విరమణ చేసి సేంద్రియ ఎరువులతో పంటలు పండించి , ఉత్తమ రైతు (2018 )అవార్డ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దామరాజు అందుకొన్నారు. దామరాజు మరణం నాటక రంగానికి తీరని లోటు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: