మెగా కాంపౌండ్‌కి చెందిన యంగ్ హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్… తమ తాజా చిత్రాలకి సంబంధించి ఒకే బాటలో పయనిస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే… ఈ ముగ్గురు కూడా ఆ యా సినిమాల్లో ఇప్పటికే జోడీకట్టిన కథానాయికలతో మరోసారి జట్టుకట్టి రిపీట్ మంత్రం పఠిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… తన తొలి చిత్రం ‘ముకుంద’లో నాయికగా నటించిన పూజా హెగ్డేతో… ‘గద్దలకొండ గణేష్’ (`వాల్మీకి` కొత్త టైటిల్) కోసం మరోసారి జతకట్టాడు వరుణ్ తేజ్. మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ రోజు (సెప్టెంబర్ 20) జనాల ముందుకు వచ్చింది. ఇక వరుణ్ లాగే బన్నీ కూడా ‘దువ్వాడ జగన్నాథం’లో ఆడిపాడిన పూజ కాంబినేషన్‌లో… ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’చేస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరపైకి రానుంది.
అలాగే మరో మెగా హీరో సాయితేజ్ కూడా తన `సుప్రీమ్` భామ రాశి ఖన్నాతో కలసి ప్రస్తుతం ‘ప్రతిరోజూ పండగే’ చేస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరి… తమకు అచ్చొచ్చిన నాయికలతో రెండోసారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఈ మెగా హీరోలు… ఈ సారి ఎటువంటి ఫలితాలు అందుకుంటారో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: