క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘విజయ్ దేవరకొండ’ వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సినిమా అప్ డేట్స్ ను బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ నాలుగు షేడ్స్ లో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి డియర్ కామ్రేడ్ తో అభిమానులను కాస్త నిరాశపరచిన విజయ్.. ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: