హరీష్ శంకర్ దర్శకత్యంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ‘గద్దలకొండ గణేష్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ లుక్స్.. మొదటిసారి నెగిటివ్ షేడ్ లో నటించడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా..? వరుణ్ కు మరో హిట్ కొట్టాడా..? అన్న విషయం తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీ నటులు : వరుణ్ తేజ్, అథర్వ మురళీ, పూజ హెగ్డే, మృణాళి రవి
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాతలు : ఆచంట రామ, ఆచంట గోపినాథ్
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ : ఆయనంక బోస్
ఎడిటర్ : చోట కె ప్రసాద్
కథ:
అభి (అథర్వ మురళీ) పెద్ద డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలా ప్రయత్నిస్తున్న క్రమంలో ఓ నిర్మాత తనకు ఆఫర్ ఇస్తాడు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ పెడతాడు. దర్శకుడు అవ్వాలంటే ఒక గ్యాంగ్ స్టర్ కథ కావాలని కోరతాడు. దీనితో ఓ రియల్ గ్యాంగ్ స్టర్ కోసం వెతుకుతున్న సమయంలో గడ్డలకొండ గణేష్ (వరుణ్ తేజ్) అనే గ్యాంగ్ స్టర్ గురించి వింటాడు. గడ్డలకొండ గణేష్ దగ్గరుండి పరిశీలించి తన కథే రాయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో అభి ఎదుర్కొన్న సవాళ్లేంటి? తను అనుకున్నట్లు కథ రాయగలిగాడా?
గద్దలకొండ గణేష్ అలియాస్ గని ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమాకు తమిళ్ లో హిట్ అయిన జిగర్తాండ మూవీ హిట్ అయింది కదా అన్న దానిపై క్రేజ్ రాలేదు. మొదటినుండి వరుణ్ తేజ్ క్యారక్టరైజేషన్, వరుణ్ లుక్స్ వల్లే అంత క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక వరుణ్ తేజ్ పై పెట్టుకున్న అంచనాలను కూడా వరుణ్ ఏమాత్రం తగ్గించలేదు. ‘గద్దల కొండ గణేష్’ పాత్రకు ప్రాణం పోశాడు. ముందే చెప్పుకున్నట్లు వరుణ్ తేజ్ కి ఇది కెరీర్ లో బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు.
అంతేకాదు ఎఫ్2 సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్న వరుణ్.. ఈ సినిమాలో కూడా తెలంగాణ యాసలో మాస్ డైలాగులను అవలీలగా చెప్పేశాడు. హరీష్ శంకర్ రాసిన కొన్ని మాస్ డైలాగులు.. వరుణ్ చెప్పినవిధానంకు థియేటర్‌లో ప్రేక్షకులు విజిల్స్ వేయకుండా ఉండరు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ సూపర్.
ఇక హీరో పాత్ర పోషించిన తమిళ్ నటుడు అథర్వ మురళీకి మంచి డెబ్యూ సినిమా అని చెప్పొచ్చు. చాలా సెటిల్డ్ గా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. పూజ హెగ్డే ఉన్నంతలో అలరించింది. మృణాళిని ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ మరోసారి తన కామెడీ టైమింగ్ తో దుమ్మురేపాడు. సత్య ఓకే. తనికెళ్ళ భరణి పాత్ర బాగుంది. నిజానికి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చేశారు అని చెప్పడం కష్టం. సినీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల్లో డైలాగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసు. ఇక ఈ సినిమాకు కూడా అవే డైలాగ్స్ ప్రధాన బలం. సినిమా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇలా సినిమాలో ప్రతీ అంశం ఆకట్టుకునే విధంగా రాసుకున్నాడు. ఒరిజినల్ లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ఇందులో యాడ్ చేసాడు. నిజానికి ఈ ఎపిసోడ్ ఉన్నా లేకాపోయిన పెద్దగా ఎం ఎఫెక్ట్ ఉండదు. ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ పాట రీమిక్స్ సాంగ్ మాత్రం మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. హరీష్ శంకర్ మరో ప్రధాన బలం ఎంటర్టైన్మెంట్. ఆ విషయంలో ఈ సినిమా నిరాశపరచదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రేసీగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంచం స్లోగా సాగినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఆడియన్స్ ను సక్సెస్ ఫుల్ గా ఎంగేజ్ చేసాడు.
మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలం. మాములుగా మిక్కీ సంగీత చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమా వేరు కాబట్టి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. వరుణ్ వచ్చేప్పుడు “వాకా వాకా” అని వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బావుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే వాల్మీకి ఒకసారి హ్యాపీగా చూడదగ్గ చిత్రమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ‘గద్దలకొండ గణేష్’ గత్తర లేపేసిండు అంతే..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: