ఇటీవల జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు చిత్ర పరిశ్రమలో దుష్ఫలితాలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రాజీనామాతో బలం చేకూరింది. కేవలం సంఖ్యాబలంతో కౌన్సిల్లో పదవులు చేజిక్కించుకున్న ప్పటికీ అక్కడ క్రియాశీలకంగా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కౌన్సిల్ పగ్గాలను యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు అప్పగించాలి అనే అంగీకారానికి అందరూ వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు గెలిచిన సభ్యులలో చాలామంది రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా కొందరు పదవులకు రాజీనామా చేయకపోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది.
రెగ్యులర్గా చిత్రాలు నిర్మించే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు కౌన్సిల్ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ తో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈరోజు మధ్యాహ్నం కౌన్సిల్ ట్రెజరర్ పదవికి రాజీనామా చేయటం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాగా చదలవాడ శ్రీనివాసరావు రాజీనామా నిర్ణయం పట్ల పలువురు సినీ ప్రముఖులు విస్మయం వ్యక్తం చేశారు.
నిర్మాతల మండలి సంక్షేమం కోసం అందరూ కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ కు కౌన్సిల్ బాధ్యతలు అప్పగించవలసి ఉండగా చదలవాడ శ్రీనివాసరావు మాత్రమే రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎందుకు ఎదురయింది ?
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ – గిల్డ్ ల మధ్య సయోధ్య కోసం ఆయన ఒక్కరే బలి అవ్వాల్సిన అవసరం ఏమిటి? ఒక మంచి కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వటం వల్లనే ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది – కాబట్టి ఆయన రాజీనామాకు మద్దతుగా మిగిలిన సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలి అని కొందరు కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేయటం గమనార్హం.
కాగా చదలవాడ శ్రీనివాసరావు రాజీనామా పై రేపు ఉదయం 11 గంటలకు జరిగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
[youtube_video videoid=_5YgiZ9XqDQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: