‘సూపర్ డీలక్స్’ రిలీజ్ కు అడ్డంకిగా సామ్

2019 Latest Telugu Film News, Samantha Doesnt Want Super Deluxe to Release in Telugu, Samantha Does Not Want That Film To Release In Telugu, Is Samantha stalling Super Deluxe release, Samantha Super Deluxe Movie, Samantha Latest Movie News, Super Deluxe Movie Latest Updates, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates

వివాహానంతరం కూడా వరుస విజయాలతో దూసుకుపోతుంది సమంత. రంగస్థలం, మహానటి, యూటర్న్, సూపర్ డీలక్స్, ఇటీవల విడుదలైన ఓ బేబి ఇలా అన్ని సినిమాలు మంచి విజయం సాధించింది. ప్రస్తుతం 96 సినిమా రీమేక్ లో నటిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సబ్జెక్ట్ లతో రావాలని ప్లాన్ చేస్తుంది సమంత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత వల్ల ఓ సినిమా రిలీజ్ కు సమస్య వచ్చిపడిందట. ఏం సినిమా అనుకుంటున్నారా..? సూపర్ డీలక్స్. సూపర్ డీలక్స్ ఎప్పుడో రిలీజైపోయింది కదా అన్న డౌట్ వచ్చింది కదా.. అసలు సంగతేంటంటే..? తమిళంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫహద్ ఫజిల్ లాంటి స్టార్ హీరో హీరోయిన్లతో తెరకెక్కిన ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలుసు. ఈ సినిమాలో బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసింది సమంత. పెళ్లయ్యాక కూడా బాయ్‌ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి పాత్ర అది. ఈ రోల్ లో సమంత నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

అయితే ఒక సినిమా హిట్ అయితే మరో భాషలోకి రీమేక్ చేయడమో.. డబ్బింగ్ చేయడమో చూస్తాం. కానీ ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. తమిళంలో చేసినపుడే ఇది తెలుగులో విడుదల కాకూడదని, తెలుగు ప్రేక్షకులకు తను ఇలాంటి రోల్స్ చేస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పిందట. దీంతో ఈ చిత్రాన్ని అనువదించాలని పలువురు ప్రయత్నిస్తున్నా కానీ సమంత దగ్గర్నుంచి ఒప్పంద పత్రం తెచ్చుకోమని చెబుతున్నారట. సమంత నుండి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కానీ తెలుగులోకి ఈసినిమా అనువదించబడుతుంది. మరి చూద్దాం.. సమంత ఎప్పుడు ఒప్పుకుంటుందో..

[subscribe]

[youtube_video videoid=htVUZR1nI0s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =