సోలో కే సై అంటున్న ముద్దుగుమ్మలు

2019 Latest Telugu Movie News, Tollywood Heroines Prefer Female Lead Oriented Movies,Tollywood Top Heroines Doing a Lady Oriented Movies, Tollywood Heroines interest in female centric movies, Tollywood Female Lead Oriented Movies, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Female oriented movies in tollywood
Tollywood Heroines Prefer Female Lead Oriented Movies

జనరేషన్ మారుతున్న కొద్దీ సినిమాలు తీసే పద్దతి కూడా మారుకుంటూ వచ్చింది. పాతకాలం సినిమాలను.. ఇప్పటి సినిమాలను పోల్చి చూస్తే ఎంతో తేడా ఉంటుంది. అప్పటి సినిమాల్లో కుటుంబ విలువలు, బంధాలు-బాంధవ్యాలు, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఇలా అనేక అంశాలు ఉండేవి. అప్పట్లో సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నాంబ, సావిత్రి, సూర్యకాంతం, జమున, వాణిశ్రీ ఇలా మహానాయికలతో నటించాలంటే అప్పటి హీరోలు సైతం భయపడే వాళ్లు. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని మరీ సినిమాలు రాసేవాళ్లు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తరువాత వచ్చిన సినిమాల్లో కూడా హీరోయిన్లకు మంచి రోల్సే దక్కేవి కానీ.. ఈ మధ్య వచ్చే సినిమాల్లో అయితే అసలు హీరోయిన్ ను ఎందుకు పెట్టారో అన్న ఆలోచన రాకుండా మానదు. మరీ దారుణంగా కాస్త గ్లామర్ కు.. పాటలకు మాత్రమే హీరోయిన్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా తయారైంది. ఇక హీరోయిన్లు కూడా దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెతను ఫాలో అయిపోతూ… వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇప్పుడు మన హీరోయిన్లకు ఈ రోల్స్ చేసి బోర్ కొట్టిందేమో తెలియదు కానీ.. రూట్ మార్చినట్టు తెలుస్తోంది.

గ్లామర్ రోల్స్ చేసి చేసి విసుగుపుట్టినట్టుంది అందుకే హీరోయిన్లు ఇప్పుడు లేడీ ఓరియెంటెంట్ మూవీస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసినిమాలతో అయినా తమలో ఉన్న నటనను మరింత ప్రేక్షకులకు చూపించే అవకాశం దక్కుతుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అనుష్క అరుంధతి సినిమాతో ఈ జనరేషన్ హీరోయిన్లకు హోప్ ఇచ్చింది. ఆ తరువాత భాగమతి, జీరో, ఇప్పుడు నిశ్శబ్దం ఇలా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక సమంత కూడా యూటర్న్ సినిమాతో ఫుల్ లేడి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఇప్పుడు ఓ బేబి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మరో లేడీ సెంట్రిక్ సినిమాకు ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాప్సీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు హిందీలో పింక్, బద్లాతో హిట్ కొట్టింది. రీసెంట్ గా గేమ్ ఓవర్ సినిమాతో హిట్ కొట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో లేడీ ప్రాధాన్యత ఉన్న సాండ్ కీ ఆంఖ్ అనే సినిమాలో నటిస్తుంది. దానితో పాటు ఇండియన్ ఉమెన్ క్రికెటింగ్ లో లెజెండ్ అయిన మిథాలీ రాజ్ బయోపిక్ లో కూడా తాప్సీ నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాజల్ కూడా ఈ మధ్య రూట్ మార్చింది. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. దీనికి నేనే రాజు నేనే మంత్రి, ఇటీవల వచ్చిన సీత సినిమాలే నిదర్శనం. తమన్నా కూడా వీళ్ల రూట్ లోనే వెళుతుంది. ఇప్పటికే అభినేత్రి, అభినేత్రి2 సినిమాలు చేసిన తమన్నా ఇకపై కూడా లేడి ప్రాధాన్యత సినిమాలే చేస్తానని చెప్పుకొచ్చింది. నిత్యా మీనన్ అయితే తన రోల్ కు ఇంపార్టెన్స్ లేకపోతే చేయనని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. నివేథా ధామస్ కూడా తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వీరితో పాటు నందిత శ్వేత, అంజలి, నందిత ఇలా పలు కథానాయికలు కూడా లేడి ప్రాధాన్యత పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

మరి డైరెక్టర్స్ కాస్త ఇప్పుడైనా కొంచెం కళ్లు తెరిచి.. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ షోకి మాత్రమే అని కాకుండా ఆలోచించి.. హీరో తో పాటు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ల రోల్ ను కూడా గట్టిగా చూపిస్తే మంచిది. లేకపోతే.. ఇలా అందరూ లేడీ ప్రాధాన్యత పాత్రలు చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తే..హీరోల పక్కన చేయడానికి హీరోయిన్లు కరువయ్యే రోజు వస్తుందేమో..

బ్యాక్ టు షూట్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =