రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నాగశౌర్య గాయపడిన సంగతి కూడా విదితమే. స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎటువంటి ఆధారం లేకుండా, డూప్ సహాయం తీసుకోకుండా 15అడుగుల ఎతైన భవనం పై నుండి దూకడంతో ఆయన మోకాలికి బలమైన గాయమైంది. దీంతో వైద్యులు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా నాగశౌర్య షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కాస్త కోలుకోవడంతో మళ్ళీ షూటింగ్ లోపాల్గొన్నాడు నాగశౌర్య. దానికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కాగా తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా సమంత ప్రధాన పాత్రలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన “ఓ బేబీ” రేపు విడుదల కానుంది. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముగ్గురు హీరోయిన్స్, ముగ్గురు దర్శకులతో నిర్మించనున్న ప్రయోగాత్మక చిత్రంలో కూడా హీరోగా నాగ శౌర్య ఎంపికైనట్లు సమాచారం.
[subscribe]
[youtube_video videoid=5gAchzPci2w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























