మ‌రోసారి `జ‌న‌తా గ్యారేజ్` కాంబినేష‌న్‌?

2019 Latest Telugu Movie News, Janatha Garage Combination To Repeat Again, Janatha Garage team again with another movie, Janatha Garage Combo Repeat Again,Jr NTR Next Movie with Director Koratala Siva,director Koratala Siva again with Jr NTR,Koratala Siva upcoming movies, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Janatha Garage Combination To Repeat Again

ఏడాదికో, రెండేళ్ళకో ఒక సినిమాను తెరకెక్కించే విజనరీ డైరెక్టర్ కొరటాల శివ… 2020లో మాత్రం రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కులకు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… గతేడాది ‘భరత్ అనే నేను’తో వ‌రుస‌గా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కొరటాల… ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి ప్రాజెక్ట్‌ను రూపొందించే పనిలో ఉన్నాడు. ‘సైరా’ సినిమాతో చిరు బిజీగా ఉన్న నేపథ్యంలో… వన్స్ ఆ మూవీ ఫినిష్ అయిన వెంట‌నే… కొరటాల తన అప్‌కమింగ్ మూవీను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బౌండెడ్‌ స్క్రిప్ట్ రెడీగా ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2020 వేసవి కానుకగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తుకున్నాడట‌ కొరటాల. ఆగస్టు 22న ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించనున్నాడు.

ఇదిలా ఉంటే… చిరు తర్వాత తను చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి కూడా పక్కా ప్లాన్‌తో ఉన్నాడట‌ కొరటాల. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఆ సినిమాను త‌న `జ‌న‌తా గ్యారేజ్‌` హీరో యంగ్ టైగర్ యన్టీఆర్‌తో కొరటాల చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’తో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్. ఆ సినిమా షూటింగ్ 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో ముగిసే అవకాశం ఉండడంతో… య‌న్టీఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభించి… 2020 సంవత్సరాంతానికల్లా రిలీజ్ చేసే విధంగా ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాడట ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్.

సో… 2020లో కొర‌టాల త‌న అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా ఇచ్చే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌.

[subscribe]

[youtube_video videoid=KdaeNxLjlm8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =