నా కొడుకు పేరు అర్జున్ రెడ్డి – సందీప్ వంగా

Sandeep Vanga Names His Son as Arjun Reddy,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sandeep Vanga About His Son Name,Sandeep Vanga Son Name as Arjun Reddy Vanga,Sandeep Vanga New Movie Updates,Director Sandeep Vanga Next Project Details
Sandeep Vanga Names His Son as Arjun Reddy

సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో.. ఇప్పుడొస్తున్న సినిమాలకు ట్రెండ్ సెట్ గా నిలిచింది. ఇక ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెలలో విడుదలకు సిద్దంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న సందీప్ వంగా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. నేను తెలుగు అర్జున్ రెడ్డి చేస్తున్నప్పుడు.. షూటింగ్ మధ్యలో ఉండగా నాకు కొడుకు పుట్టాడు.. అందుకే వాడికి అర్జున్ రెడ్డి అనే పేరే పెట్టానని చెప్పాడు. అంతేకాదు ఇంకా కబీర్ సింగ్ సినిమా గురించి చెబుతూ.. ముంబై లో పుట్టిన పంజాబీ అబ్బాయి..ఢిల్లీకి మెడిసన్ చదువుకోవడానికి వెళతాడు… అలాంటి కబీర్ సింగ్ పాత్ర రాయడం చాలా కష్టం..అయితే తెలంగాణ రెడ్డీస్ కి.. పంజాబీ సింగ్స్ కు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి.. ఫుడ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ మరియు గట్టిగా అరిచే ఎమోషనల్స్ ఇలా పోలీకలు ఉంటాయని చెప్పారు. ఇంకా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ.. ఇప్పటికే మహేష్ బాబుకు ఒక కథ చెప్పాను.. దానితో పాటు మరో క్రైమ్ డ్రామా గురించి రాస్తున్నాని చెప్పాడు.

మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో.. తన కొడుకు పేరు కూడా అంతే సంచలనం సృష్టిస్తుందేమో. పేరు వరకూ ఐతే పర్వాలేదు కానీ.. అదే యాటిట్యూడ్ వస్తే కష్టమే మరీ..

[subscribe]
[youtube_video videoid=lG_Zw5fT5Jo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.