జూలై నెల… సంవత్సరంలో ద్వితీయార్ధానికి మొదటి నెల. ఇంకా చెప్పాలంటే… సంవత్సరానికి “సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్”. అటువంటి నెలలో ప్రతీ వారాన్ని టార్గెట్ చేస్తూ… తెలుగునాట వరుసగా కొన్ని ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రానున్నాయి. అంతేకాదు… ప్రతీ వారం ఒక్కో జానర్‌కి చెందిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడం ఆసక్తికరమైన అంశం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటిలో ముందుగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత, లేడీ డైరెక్టర్ బి.నందినీ రెడ్డి కలయికలో రూపొందిన ‘ఓ బేబీరిలీజ్ కానుంది. కొరియన్ మూవీ
మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్… జూలై మొదటి వారంలో అంటే జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కట్ చేస్తే… ఇదే రోజున ఆనంద్ దేవరకొండ (విజయ్ దేవరకొండ తమ్ముడు), శివాత్మిక (సీనియర్ హీరో రాజశేఖర్ రెండో కుమార్తె) జంటగా పరిచయమవుతున్న పిరియాడిక్ లవ్ స్టోరీ ‘దొరసాని’ కూడా రిలీజ్ కానుంది.
అలాగే… జూలై రెండో వారంలో అంటే జూలై 12న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తెరపైకి రానుండగా… మూడోవారంలో (జూలై 18న) బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘రాక్షసుడు’(తమిళ చిత్రం ‘రాట్చసన్’కి రీమేక్) విడుదల కానుంది.
ఇక చివరి వారంలో అంటే… జూలై 26న యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ విడుదల కానుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
వీటితో పాటు ఆర్ ఎక్స్ 100
ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గుణ 369
కూడా ఇదే జూలై నెలలో తెరపైకి రానుందని సమాచారం.
మొత్తమ్మీద… ప్రతీ వారం ఒక్కో జానర్‌తో ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్న ఈ సినిమాలు… బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=nrQgHxNKrcQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: