వన్ ఇయర్ కట్ చేస్తే సీన్ రివర్స్

Rajasekhar Daughters Shivathmika And Shivani Debut Story,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajasekhar Daughters Entry in Movies,Tollywood Star Hero Daughters in Films,Shivathmika And Shivani Debut Film Story
Rajasekhar Daughters Shivathmika And Shivani Debut Story

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఉంటే వారిలో ఒకరికి లక్ బాగా కలిసొస్తుందన్న వాస్తవం అనాది నటీనటుల నుండి చూస్తూనే ఉన్నాం. రాధిక, నిరోషా లలో రాధిక బాగా సక్సెస్ అయింది.. భానుప్రియ, శాంతి ప్రియ లలో భానుప్రియ సక్సెస్ అయింది…అలానే నేటి హీరోయిన్లలో కాజల్, నిషా అగర్వాల్ లలో కాజల్ క్లిక్ అయింది.. ఇలా ఒకరు మాత్రమే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ కు మరో ఇద్దరు అక్కా చెల్లెళ్లు అరంగేట్రం చేస్తున్నారు. వారు ఎవరో కాదు రాజశేఖర్ కూతుళ్లు శివాని మరియు శివాత్మిక.

అయితే వీరిద్దరి విషయంలో సినిమా రిలీజ్ కు ముందే ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటున్నాయి. నిజానికి శివాని, శివాత్మికలలో లుక్స్ పరంగా చూస్తే శివానినే కాస్త బెటర్ అనిపిస్తుంది. అందుకే మొదట శివానికే అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అది కూడా ఫామ్ లో ఉన్న అడివి శేష్ తో. ‘2 స్టేట్స్’ లాంటి క్రేజీ బాలీవుడ్ మూవీ రీమేక్‌ ను అడివి శేష్, శివాని కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ సినిమా పలు విబేధాల్లో ఇరుక్కుంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.

ఇక రెండో కూతురు శివాత్మిక ఎంట్రీనే చాలా కష్టంగా జరిగింది. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శివాత్మిక, విజయ్ దేవకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కాంబినేషన్ లో దొరసాని అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో సీన్ రివర్స్ అయింది. అక్క కంటే చెల్లిని తక్కువ అంచనా వేశారు కానీ.. ఇప్పుడు శివాత్మిక సినిమానే సైలెంట్ గా పూర్తి చేస్తుంది. అంతేకాదు రెండు రోజుల క్రితం దొరసాని సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దొరసాని లుక్ లో శివాత్మికకు మంచి మార్కులు పడ్డాయి. శివాత్మిక లుక్ ప్రామిసింగ్‌గా కనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. మరోవైపు చూస్తే శివాని సినిమా మధ్యలోనే ఆగిపోయింది. చూడబోతే అక్క కంటే చెల్లెలి సినిమానే ముందు వచ్చేలా ఉంది. సో దీన్నిబట్టి అందం ఒక్కటే కాదు.. అదృష్టం కూడా ఉండాలన్న వాస్తవం మరోసారి రుజువైంది మరి అక్క కంటే చెల్లిని తక్కువ అంచనా వేశారు.. ఇప్పుడు చూస్తే అక్క కంటే చెల్లే కథానాయికగా క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. చూద్దాం మరి ఇద్దరి అక్కా చెల్లెళ్ల భవిష్యత్ ఎలా ఉందో..

[subscribe]

[youtube_video videoid=E_tQyAdhZ1A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =