మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాను కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ని జూన్ నెలాఖరు కల్లా కంప్లీట్ చేయనున్నారని టాక్. ఇదిలా ఉంటే… ‘సైరా’ సెట్స్ పై ఉండగానే కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరిందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారట. అలాగే… ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరిపేందుకు ప్రణాళిక జరుగుతోందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని… 2020 ఉగాది సందర్భంగా వేసవి ఆరంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=KdaeNxLjlm8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























