ఒక దర్శకుడికి జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ ఏర్పడటం సామాన్యమైన అచీవ్మెంట్ కాదు.జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ అంటే నాలుగు హిట్స్ రాగానే ఆకాశంలో తేలిపోవడం… నాలుగు ఫ్లాపులు రాగానే అడ్రస్ లేకుండా పోవటం కాదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దర్శకుడి పట్ల అంచనాలు, అతని టాలెంట్ మీద నమ్మకం తగ్గకపోవటాన్నే జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ అంటారు. అలాంటి ఇమేజ్ ఉన్న అతి కొద్దిమంది దర్శకుల్లో తేజ ఒకరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అతని ప్రీవియస్ హిట్స్ అండ్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా తేజ సినిమా పట్ల ఒక క్రేజు, ఎంక్వయిరీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. రెండేళ్ల క్రితం వరుస ఫ్లాపుల పరంపర నుండి ” నేనే రాజు నేనే మంత్రి” హిట్ తో సక్సెస్ బాట పట్టారు తేజ. కాగా ఈ రెండేళ్లలో “ఎన్టీఆర్ బయోపిక్”, వెంకటేష్ తో “ఆట నాదే వేట నాదే” చిత్రాల డ్రాపింగ్ తరువాత తన దర్శకత్వంలో రూపొందిన “సీత” ఈ రోజు ( మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “సీత” అనే ట్రెడిషనల్ టైటిల్ రోల్ లో కాజల్ అగర్వాల్ అనే ఒక టాప్ ర్యాంక్ హీరోయిన్ తో నెగిటివ్ రోల్ చేయించిన తేజ గట్స్ కు అభినందనలు దక్కుతాయో, విమర్శలు ఎదురవుతాయో రివ్యూలో చూద్దాం.
కథ :
నిజానికి లోటు పాట్లు – తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ ‘సీత’ చిత్రాన్ని ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా అభినందించవచ్చు. హీరోయిన్ అంటే తండ్రి చాటు మొగ్గగా, హీరో చాటు సిగ్గుగా , అమ్మ చాటు బిడ్డగా చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకు సీత సినిమాలో కాజల్ చేసిన సీత క్యారెక్టర్ డిఫరెంట్ గా అనిపిస్తుంది అనటంలో సందేహం లేదు. ఇక కథలోకి వెళితే – సీత (కాజల్ అగర్వాల్) అహంకారానికి మారుపేరు, మరో పేరు అన్నట్టుగా బిహేవ్ చేసే ఒక కార్పొరేట్ బిజినెస్ టైకూన్. తండ్రి (భాగ్యరాజా)తో గొడవపడి వచ్చి కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది.ఆ బిజినెస్ లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే , రౌడీ అయిన బసవరాజు( సోనూసూద్) తో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంది. అతనితో ఒక నెల రోజుల పాటు సహజీవనం చేయాలన్నది ఆ అగ్రిమెంట్ సారాంశం. కళ్ళు మూసుకుపోయిన అహంకారంతో అగ్రిమెంటు మీద సైన్ చేసి ఆ తరువాత అతనికి దొరకకుండా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఎలాగైనా అనుభవించడానికి వేట ప్రారంభిస్తాడు బసవరాజు. ఇదిలా ఉంటే తన తండ్రి రాసిన వీలునామా ప్రకారం 5 వేల కోట్ల ఆస్తి ఆమె మేనబావ అయిన రఘురాం( బెల్లంకొండ సాయి శ్రీనివాస్) కు చెందుతుంది. అయితే చిన్నప్పుడే మేనత్త అంటే కాజల్ తల్లి పెట్టే చిత్రహింసలకు దూరంగా అతన్ని తీసుకెళ్లి భూటాన్ లోని ఒక బౌద్ధ మతంలో ఉంచి పెంచుతాడు సీత తండ్రి.
తన ఆస్తి మేనబావ పేరుమీద రాసిన తండ్రిని దూషిస్తూ ఎలాగైనా బావ నుండి తన ఆస్తిని తిరిగి పొందాలని భూటాన్ వెళ్లి అతన్ని వెంట తెస్తుంది సీత. ఒకవైపు సీత ఆర్థిక మూలాలను స్తంభింప చేస్తూ ఆమెను రకరకాల ఇక్కట్ల పాలు చేస్తుంటాడు బసవరాజు. భూటాన్ లో బౌద్ధ మత క్రమశిక్షణలో పెరిగిన రఘు రామ్ శారీరకంగా ఎదిగినప్పటికీ మానసికంగా స్వాతిముత్యం లో కమల్ హాసన్ లా తయారవుతాడు. చిన్నప్పటినుండి సీత పట్ల ఆరాధన భావాన్ని పెంచుకున్న రఘురామ్ ను చాలా చులకనగా చూస్తుంది సీత. అయితే అతని నుండి తన వేలకోట్ల ఆస్తిని లాగేసుకోవటం కోసం సీత చేసిన ప్రయత్నాలు ఏమిటి? బసవరాజు బారినుండి సీత ఎలా తప్పించుకుంది? అందులో రఘురాం పాత్ర ఏమిటి? నిజాయితీ పరుడు, అతి బలవంతుడు, అతి అమాయకుడు, మేధావి అయిన రఘురాం నుండి సీత ఆస్తిని లాక్కో కలిగిందా? ఒక సగటు భారతీయ మహిళ మనస్తత్వానికి భిన్నంగా స్వార్థం, గర్వం, డబ్బు కోసం ఏమైనా చేసే దుష్ట చింతన వంటి నెగిటివ్ లక్షణాలు కలిగిన సీత లో చివరికి ఎలాంటి మార్పు వచ్చింది…. ఆ మార్పు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది- ఇది టూకీగా ‘సీత’కథ.
తేజ ఎలా తీశారు:
స్త్రీ ఔన్నత్యాన్ని, మంచితనాన్ని, సహనాన్ని, త్యాగాన్ని, అందాన్ని మాత్రమే చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకు హీరోయిన్ను విలన్ గా చూపించేందుకు సాహసించిన తేజ గట్స్ ను ముందుగా అభినందించాలి. రొటీన్ కథలు, క్యారెక్టరైజేషన్స్ కు భిన్నంగా వెళ్లి ఒక డిఫరెంట్ సినిమా చేయాలి అన్న తేజ ప్రయత్నం చాలా వరకు ఫలిన్చిందనే చెప్పాలి. కథగా ఇది గొప్ప కథ మాత్రం కాదు…. కొత్త కథ కూడా కాదు. కానీ పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రలకు తగిన ఆర్టిస్టులను ఎన్నుకున్న విధానం సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆర్టిస్టుల నుండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న చిత్రాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ గా నిలుస్తుంది సీత.
క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ బలంగా ఉండటంతో కథా లోపం పెద్ద లోపంగా అనిపించలేదు. పాత్రలను మలుచుకున్న విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మెయిన్ విలన్ సోనూసూద్ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు దర్శకుడు తేజ. తనను తానే తిట్టించుకోవటం, తనమీద తానే సెటైర్ వేసుకోవడం ఈ పాత్ర ప్రత్యేకత. మధ్యలో చిన్న డ్రాపింగ్ కనిపించినప్పటికీ మొత్తం మీద సీత చిత్రాన్ని దర్శకుడు తేజ చాలా ఇంట్రెస్టింగ్ గా హ్యాండ్ చేశాడని చెప్పవచ్చు. అయితే హాస్యానికి కూడా మంచి అవకాశం ఉన్న ఈ కథ నుండి రావలసినంత, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ను పిండుకోవడం మీద తేజ అంత దృష్టి పెట్టినట్టుగా అనిపించదు.
పర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా ఫస్టు మార్కులు కొట్టేసింది సోనుసూద్ అని చెప్పాలి. గతంలో కందిరీగ చిత్రంలో ఇలాంటి సీరియస్ కామెడీ విలనీని పోషించిన సోనుసూద్ కు మరలా అంతకంటే పొటెన్షియల్ క్యారెక్టర్ సీత చిత్రంలో దొరికింది. అద్భుతమైన టైమింగ్ తో , పర్ఫార్మెన్స్ తో ఈ పాత్రను ఆద్యంతం రక్తికట్టించాడు సోనుసూద్. ఇక సీత పాత్రలో కాజల్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అనే చెప్పాలి. అందం అహంకారం కలగలిసిన సీత పాత్రలో కాజల్ పర్ఫార్మెన్స్ చాలా స్టైలిష్ గా, కార్పొరేట్ స్టాండర్డ్స్ లో ఉంది. ఇక రఘు రామ్ గా బాడీ తప్ప బ్రెయిన్ పెరగని స్వాతిముత్యం లాంటి పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాప్ట్ గా కనిపించాడు. సీత పట్ల ఆరాధనను, కమిట్మెంట్ ను, అమాయకత్వాన్ని, చక్కగా అభినయించాడు బెల్లంకొండ.
అయితే అప్పియరెన్స్ కు తప్ప పర్ఫార్మెన్స్ కు పెద్దంతగా అవకాశం లేని పాత్ర కావటంతో పాత్ర పరిధి మేరకు రిక్వైర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బెల్లంకొండ సాయి సినిమా.ఈ మూడు పాత్రల మీద,ఈ ముగ్గురి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇతర పాత్రల మీద పాత్రధారుల మీద పెట్టినట్లుగా లేడు తేజ. కొన్ని పాత్రలకు నటీనటుల ఎంపికలో అశ్రద్ధ కనిపించింది. సీత అసిస్టెంట్ పాత్రలో నటించిన అభినవ్ పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా అనిపించింది. సోనూసూద్ పియ్యే గా తనికెళ్ల భరణి బాగా చేశారు.
టెక్నికల్ అంశాలు :
‘సీత’ – సినిమా చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ గా సాగటానికి ప్రధాన కారణం డైలాగ్స్.
డైలాగ్ రైటింగ్ లోనే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్ అవుతుంది అనటానికి నిదర్శనంగా నిలుస్తుంది ఇందులోని డైలాగ్ రైటింగ్ స్టైల్. తేజ ప్రీవియస్ హిట్ “నేనే రాజు నేనే మంత్రి” కి డైలాగ్స్ రాసిన లక్ష్మీ భూపాల ఈ చిత్రానికి కూడా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇవ్వటం అభినందనీయం. ముఖ్యంగా ఒక కన్ఫ్యూజ్డ్ క్యారెక్టరైజేషన్ కలిగిన సోను సూద్ పాత్రకు చాలా మంచి పంచ్ లు రాసి మెప్పించాడు లక్ష్మీ భూపాల. ఇక సంగీతపరంగా చూసుకుంటే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది లేదు… మైనస్ అయింది లేదు. ఎడిటింగ్, కెమెరా వంటి టెక్నికల్ అంశాలు అప్ టు ద మార్క్ అనిపించాయి. మేకింగ్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సబ్జెక్ట్ కు తగిన స్థాయిలో ఖర్చుపెట్టి సినిమా విజువల్ ఫీస్ట్ గా రూపొందడంలో నిర్మాతల మేకింగ్ స్టాండర్డ్స్ అభినందనీయంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
ప్రధాన పాత్రల పర్ఫార్మెన్స్
డైలాగ్స్
టేకింగ్
మేకింగ్ వాల్యూస్
మైనస్ లు:
ప్లస్ కానీ సంగీతం
కొన్ని పాత్రల మిస్ కాస్టింగ్
సెకండాఫ్ లో కొంత డ్రాపింగ్
మొత్తం మీద చూసుకుంటే రెండేళ్ల గ్యాప్ తరువాత తేజ నుండి వచ్చిన ‘సీత’ రెండున్నర గంటల ఎంటర్టైన్మెంట్ కు డోకా లేని డిఫరెంట్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు.
[wp-review id=”22236″]
[subscribe]
[youtube_video videoid=Pvr0ecUuklY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: