బాలీవుడ్ అయిపోయింది మరో ఇండస్ట్రీ

Krish Jagarlamudi To Direct Bollywood Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Krish Jagarlamudi To Direct With Akshay Kumar New Movie,Director Krish Jagarlamudi Next With Bollywood Hero,Krish Roped in For Akshay Kumar Movie,Director Krish To Work With Bollywood Hero Akshay Kumar
Regina Cassandra to Make Malayalam Debut with Mohanlal

చెన్నై బ్యూటీ రెజీనా కసాండ్ర తెలుగులో సినిమా చేసి దాదాపు ఏడాది దాటిపోయింది. ఏడాది నుండి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో ఈ భామ బాలీవుడ్ లో అడుగుపెట్టేసింది. ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా అనే సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన రెజీనా ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్‌ కపూర్‌ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్‌ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు రెజీనా మరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఈసారి మలయాళ పరిశ్రమలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సిద్దిఖీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మొహన్ లాల్ పక్కన నటించబోతుంది. కాగా ప్రస్తుతం రెజీనా తెలుగులో సెవన్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

[subscribe]
[youtube_video videoid=FnabE442Sj0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.