ఈ వేసవిలో టాక్ ఆఫ్ టాలీవుడ్
గా నిలిచిన యువ దర్శకులు శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి. మజిలీ
రూపంలో శివ తన దర్శకత్వ ప్రతిభతో మెస్మరైజ్ చేస్తే… జెర్సీ
తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా అమేజింగ్ ఇన్నింగ్స్ చేయడమే కాకుండా యంగ్ టైగర్ యన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ప్రశంసలు కూడా పొందాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ ఇద్దరి ప్రయాణంలోనూ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అటు శివ నిర్వాణ, ఇటు గౌతమ్ తిన్ననూరి… ఇద్దరూ కూడా 2017లోనే టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలైన ‘నిన్నుకోరి’ రూపంలో శివ నిర్వాణ ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని ప్రేక్షకులకు పరిచయం చేయగా… అదే సంవత్సరం చివరలో ‘మళ్ళీరావా’ రూపంలో ఫీల్ గుడ్ లవ్ స్టొరీని ప్రేక్షకులకు అందించి సక్సెస్ అయ్యాడు గౌతమ్. ఇలా మొదటి ప్రయత్నాల్లోనే… అభిరుచి గల ప్రేక్షకుల నుంచి మంచి మార్కులను సంపాదించారు ఈ యువ దర్శకులు. కట్ చేస్తే… 2018లో వార్తల్లో వినబడని ఈ దర్శకద్వయం… 2019లో మళ్ళీ తమ మలి చిత్రాలతో, తమ మార్కు కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. అది కూడా… రెండు వారాల గ్యాప్‌లో రావడం గమనార్హం.
శివ నిర్వాణ రెండో చిత్రంగా వచ్చిన ‘మజిలీ’ ఏప్రిల్ 5న విడుదల కాగా… గౌతమ్ రూపొందించిన మలి చిత్రం ‘జెర్సీ’ ఏప్రిల్ 19న రిలీజైంది. విశేషమేమిటంటే… ఈ రెండు చిత్రాలు కూడా క్రికెట్ నేపథ్యంలోనే తెరకెక్కాయి. అలాగే… కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ ఈ రెండు చిత్రాలూ హార్ట్ టచింగ్ మూమెంట్స్‌తో రూపొందాయి. మొత్తమ్మీద… రెండో చిత్రాలతోనూ విమర్శకుల ప్రశంసలే కాదు ప్రేక్షకుల ఆదరణను కూడా పొందారు శివ, గౌతమ్.మరి… తొలి, మలి చిత్రాలతో ఒకేలాంటి అడుగులు వేసిన ఈ ప్రతిభావంతులు… మూడో చిత్రంతోనూ కామన్ ఫ్యాక్టర్స్ పరంగా మురిపిస్తారేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=kbk2PJh9KYI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: