‘c/o కంచరపాలెం’ కు అరుదైన అవార్డ్

C/o Kancharapalem Movie Wins Critics Choice Award,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,C/o Kancharapalem Movie Latest Updates,C/o Kancharapalem Movie Gets an Award,C/o Kancharapalem Telugu Movie Latest News,C/o Kancharapalem Movie Wins a Critics Film Award
C/o Kancharapalem Movie Wins Critics Choice Award

హీరో హీరోయిజం.. హీరోయిన్ గ్లామర్.. భయంకరమైన విలన్.. నాలుగు యాక్షన్ సీన్లు.. ఆరు పాటలు.. ఒకప్పుడు సినిమా ఫార్మట్ ఇది. అయితే అప్పట్లో ఈ ఫార్ములా వర్కవుట్ అయింది కాని.. ఇప్పుడు ఇదే ఫార్ములాతో సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించాలంటే మాత్రం కష్టమే. మారుతున్న జనరేషన్ తో పాటు ప్రేక్షకుల అభిరుచి కూడా మారుతుంది. ఎంత రిచ్ గా తీశారు.. ఏ లొకేషన్స్ లో తీశారు..ఎంత బడ్జెట్ తో తీశారు ఇలాంటివేం పట్టిచుకోకుండా సినిమాలో కంటెంట్ ఉందా? లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అదిరిపోయే యాక్షన్ సీన్లు.. పంచ్ డైలాగులు లేకుండా కేవలం సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమా ‘c/o కంచరపాలెం’. వెంకటేశ్ మ‌హా తొలి ప్రయత్నంలోనే మంచి పేరును సంపాందించుకున్నాడు. ఇక కథలో కొంచెం విభిన్నత ఉంటే ఆలాంటి కథలను సపోర్ట్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. అలా ఈ సినిమాను కూడా తమ ప్రొడక్షన్ లో రానా విడుదల చేయగా.. ఎన్నారై విజయ ప్రవీణ నిర్మించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఎంపికై రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల నేషనల్ అవార్డుకు నామినేట్ అయ్యే ఛాన్స్ ను కోల్పోయింది. ఇదిలా ఉండగా తాజాాగా ఈసినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డ్ ను సొంతం చేసుకుంది. ముంబైలో ఈరోజు జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. మరి దేశంలో ఉన్న ప్రముఖ విమర్శకుల అభిప్రాయంతో ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. ఈనేపథ్యంలో తెలుగులో గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ రంగస్థలం, మహానటి సినిమాలకు సైతం దక్కని అవార్డ్ ‘c/o కంచరపాలెం’ కు దక్కడం హర్షించదగ్గ విషయమే. ముందు ముందు ఇలాంటి తెలుగు సినిమాలు మరెన్నో రాావాలని.. తెలుగు సినీ గౌరవాన్ని ఇలానే పెంచాలని కోరుకుందాం…

[subscribe]
[youtube_video videoid=tZVvIxr91nQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =