రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న‌ త్రివిక్ర‌మ్‌

20 Years For Director Trivikram Srinivas In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Trivikram Srinivas New Movie Updates,Director Trivikram Srinivas Completes 20 Years in Industry,Trivikram Srinivas Next Project Details,20 Years For Trivikram in Telugu Film Industry
20 Years For Director Trivikram Srinivas In TFI

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌… తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్‌. ర‌చ‌యిత‌గా కెరీర్‌ని మొద‌లుపెట్టి ద‌ర్శ‌కుడిగానూ రాణించిన వైనం ఆయ‌న సొంతం. అలాంటి… త్రివిక్ర‌మ్ తొలి అడుగులకు వేదిక‌గా నిలిచిన చిత్రం స్వ‌యం వ‌రం. త్రివిక్రమ్ అందించిన కథ, మాటలతో… కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. ఈ సినిమాతోనే తొట్టెంపూడి వేణు, లయ హీరోహీరోయిన్లుగా తెలుగు తెర‌కు పరిచయమ‌య్యారు. వెంకట శ్యామ్‌ ప్రసాద్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్… అప్ప‌ట్లో మంచి విజయాన్ని అందుకుంది. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మాజీ, కవిత, సుధ, ఎం.ఎస్.నారాయణ, సునీల్ తదితరులు ఇందులో ఇతర పాత్రల్లో నటించారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరచిన పాటలు శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా “కీరవాణి రాగంలో”, “పికాసో చిత్రమా”, “మరల తెలుపనా” పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘స్వయంవరం’ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది ఆ సినిమాలోని సంభాష‌ణ‌లు. త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన ఆ మాటలలో కొన్ని: “ఏడడుగులు నడిస్తే చాలు జన్మజన్మలు నీతో ఉండిపోతాను”, “ప్రేమలో ఒకరిపై ఒకరికి అభిమానం ఉంటుంది. కాని పెళ్లి జరిగితే ఒకరిపై ఒకరికి అధికారం వస్తుంది”. వీటితోపాటు కామెడీతో పేలే పంచ్ డైలాగ్స్ కూడా అలరిస్తాయి. 1999 ఏప్రిల్ 22న విడుదలైన ‘స్వయంవరం’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

‘స్వయంవరం’ – కొన్ని విశేషాలు:
• ‘ప్రార్ధన’(1991)తో దర్శకుడిగా పరిచయమైన కె.విజయ భాస్కర్‌కి ‘స్వయంవరం’(1999) రెండో చిత్రం. సుదీర్ఘ విరామం త‌రువాత రెండో చిత్రంతో ప‌ల‌క‌రించినా… మంచి విజ‌య‌మే ద‌క్కింది. ఆ త‌రువాత వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేశాడు.
• త్రివిక్రమ్ మాటల రచయితగా, క‌థా రచ‌యిత‌గా పరిచయమైన తొలి చిత్రం. ఆ తర్వాత త్రివిక్రమ్, కె. విజయ భాస్కర్ కాంబినేషన్‌లో ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవ!వంటి సినిమాలు వచ్చాయి. వీటిలోజై చిరంజీవ‌!` మిన‌హా మిగిలిన అన్ని చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి.
• ఇక నంది అవార్డుల విష‌యానికొస్తే… ఉత్తమ గాయనిగా చిత్ర (“మరల తెలుపనా”), ఉత్తమ సంగీత దర్శకుడిగా ‘వందేమాతరం’ శ్రీనివాస్ అందుకోగా… వేణు స్పెష‌ల్ జ్యూరీ అవార్డుని స్వీక‌రించాడు.
• ఈ సినిమాని 2001లో ‘లవ్ మ్యారేజ్’ పేరుతో తమిళంలోనూ, ‘క్యా దిల్ నే కహా’(2002) పేరుతో హిందీలోనూ రీమేక్ చేశారు.

[subscribe]


[youtube_video videoid=4jtfbFYLrX4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =