వరుస సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుడు కార్తి. ఒకవైపు తను నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’ విడుదలకు సిద్ధం కాగా… మరో వైపు ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజా కన్నన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం… ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగనే… మరో ఆసక్తికరమైన చిత్రానికి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మలయాళ చిత్రం దృశ్యం
(2013)తో పాటు ఆ సినిమా తమిళ వెర్షన్ పాపనాశం
(2015)కి కూడా దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ డైరెక్షన్‌లో కార్తి ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పూర్వ నిర్మాణ పనులను జరుపుకుంటోంది. కాగా… థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో రూపుదిద్దుకోబోయే ఈ సినిమాలో కార్తి పాత్రతో పాటు… కార్తి అక్క పాత్ర కూడా చాలా కీలకమట. ఈ నేపథ్యంలో… కథానాయకుడి అక్క పాత్ర కోసం టాలెంటెడ్ యాక్ట్రస్ జ్యోతికను సంప్రదించిందట చిత్ర బృందం. కథ నచ్చడంతో ఆమె కూడా అంగీకరించిందని సమాచారం. మరి నిజ జీవితంలో వదిన, మరిది అయిన జ్యోతిక, కార్తి… స్క్రీన్‌పై అక్క, తమ్ముడుగా ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: