సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో `అల్లరి` నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “చోటీ చోటీ బాతే”… మహేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోతలను కూడా విశేషంగా అలరిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే సినిమాలో మహేష్ క్యారెక్టర్ తాలూకు `సక్సెస్`ఫుల్ జర్నీని ఎలివేట్ చేస్తూ తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్ “నువ్వే సమస్తం” కి కూడా మంచి బాణీని అందించాడు దేవిశ్రీ. అయితే… ఈ పాట సన్నివేశాల్లో భాగంగా అక్కడక్కడ బ్యాగ్రౌండ్ సాంగ్‌గా వస్తుందని సమాచారం. ఈ పాటతో పాటు మరో పాట కూడా ఆర్.ఆర్‌గా సినిమాలో వస్తుందని సమాచారం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని పాటలకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే… ఈ సినిమాలో మొత్తంగా ఎనిమిది పాటలు ఉంటాయట. వాటిలో ఆరు స్ట్రయిట్ సాంగ్స్ కాగా… రెండు ఆర్.ఆర్ తరహా గీతాలు అని టాక్. మరి… ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే… ఈ నెలాఖరులో `మహర్షి` నుంచి ఫుల్ ఆల్బమ్ వచ్చే అవకాశముంది. సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న `మహర్షి` మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: