జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న కథానాయకుడు మాస్ మహరాజ్ రవితేజ. గత ఏడాది `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` చిత్రాలతో అభిమానులను పలకరించిన రవితేజ… ఈ సంవత్సరం కూడా అదే జోరు చూపించనున్నాడు. ఈ ఏడాది… రవితేజ నుంచి `డిస్కో రాజా`, `కనకదుర్గ` (ప్రచారంలో ఉన్న పేరు) రూపంలో రెండు యాక్షన్ ఎంటర్‌టైనర్లు రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పిరియాడిక్ టచ్‌తో రూపొందుతున్న `డిస్కోరాజా`ని వీఐ ఆనంద్ రూపొందిస్తుండగా… ఇందులో డిస్కో డ్యాన్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు రవితేజ. ఇక తమిళ బ్లాక్‌బస్టర్ `తెరి` ఆధారంగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న `కనకదుర్గ`లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు ఈ మాస్ మహరాజ్.
కాగా… `కనకదుర్గ` చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభం కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజకి జోడీగా కాజల్, కేథరిన్ నాయికలుగా నటించనున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=alrCULlu9ts]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: