`ఆర్ ఎక్స్ 100` వంటి సంచలన విజయం తరువాత యువ కథానాయకుడు కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం `హిప్పీ`. `నువ్వు నేను ప్రేమ` (సూర్య, జ్యోతిక, భూమిక) వంటి మ్యూజికల్ హిట్‌ని రూపొందించిన టి.ఎన్.కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా… ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ మూవీని నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కార్తికేయకి జోడీగా దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… అందాల తార శ్రద్ధా దాస్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించబోతోంది. అలాగే… ఓ ప్రత్యేక గీతంలోనూ శ్రద్ధ తన చిందులతో కనువిందు చేయనుందట. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని… ఇదో ఫన్ మాస్ సాంగ్ అని శ్రద్ధ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న `హిప్పీ`… ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: