తాజాగా విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ `118`తో టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు ఇదే ఊపులో… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ఈ నందమూరి వారి కథానాయకుడు. వేణు మల్లిడి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించే అవకాశముందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `తుగ్లక్` పేరుతో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కళ్యాణ్ రామ్ రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తాడని టాలీవుడ్ టాక్. గతంలో `హరే రామ్` చిత్రంలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసి అలరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… చాన్నాళ్ళ తరువాత కళ్యాణ్ రామ్ చేస్తున్న ఈ డబుల్ యాక్షన్ మరోసారి కలిసొస్తుందేమో చూడాలి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: