లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదటి రోజు కలెక్షన్స్ … దుమ్ము రేపిందా ..?

Lakshmi’s NTR Movie First Day Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lakshmi’s NTR Movie 1st Day Box Office Collections,Lakshmi’s NTR Movie First day Area Wise Collections,Lakshmi’s NTR Movie WorldWide Collections,Lakshmi’s NTR Movie Collections
Lakshmi’s NTR Movie First Day Collections

లక్ష్మీస్ ఎన్టీఆర్ .. ఎన్నో వివాదాలతో విడుదలై మంచి ఓపెనింగ్స్ సంపాదించుకున్నది. జనాల్లో ఎక్కడ లేని క్యూరియాసిటీ ని ఈ సినిమా రేపిందంటే అతిశయెక్తి కాదు. రెక్ట్ కథ పడాలే కాని.. స్క్రీన్ ప్లేతో చెడుగుడు ఆడుకునే రామ్ గోపాల్‌ వర్మ చాలా ఏళ్ల తరువాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అనేక వివాదాలు.. కోర్టు కేసులు.. స్టేలు.. తెలుగు తమ్ముళ్ల నిరసనల మధ్య శుక్రవారం నాడు విడుదలైన వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌ని రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీ పార్వతి కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథను తయారుచేసిన వర్మ.. ఈ చిత్రంలో చూపించినవన్నీ.. నిజమా అబద్ధమా అన్న విషయాలపై భిన్నవాదనలు నడుస్తున్న సందర్భంలో తాను అనుకున్న కథను కన్విన్సింగ్ గా బ్యాలెన్స్ చేస్తూ మెజారిటీ ఆడియన్స్ మద్దతుని కూడగట్టాడు. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే.. సుమారు 550 థియేటర్స్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నించగా.. చివర్లో హైకోర్ట్ స్టేతో నైజాంలో 250 థియేటర్స్‌కి మాత్రమే పరిమితం అయ్యింది.

దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఆంధ్రలో అన్ని షోలు రద్దు కావడంతో తెలంగాణలో విడుదల అవుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ.. 55% వరకు ఆన్ లైన్ బుకింగ్స్‌తో జోరు చూపింది. యూఎస్‌లో 125 స్క్రీన్స్‌పై భారీగా విడుదలైన ఈ మూవీ.. తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఒక్క ప్రీమియర్ షోస్ ద్వారా 90,214 డాలర్లు రాబట్టింది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారానికి మరింత పుంజుకున్నాయి. గురు, శుక్రవారాలను కలుపుకుని 145,928 డాలర్లు ఓపెనింగ్స్ వసులు చేసింది లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ షోస్ ద్వారా 482,599 డాలర్లు రాబట్టగా.. ఎన్టీఆర్ మహానాయకుడు 102,234 డాలర్లు రాబట్టింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ 90,214 డాలర్లు రాబట్టింది. కాగా తెలంగాణలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్ని షోలు హౌస్ ఫుల్ కావడం.. సంక్రాంతి తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి క్యూ కడుతుండటంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మంచి కలెక్షన్లు రాబట్టివచ్చునని ట్రేడ్ అనలిస్ట్‌లు లెక్కలు కడుతున్నారు.

[subscribe]
[youtube_video videoid=NpQmNg7v8sA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + twenty =