యాక్షన్ ఎంటర్ టైనర్ గా సూర్య – శివ చిత్రం?

Suriya New Movie To Be An Out And Out Action Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Suriya Next Film Updates,Suriya New Movie News,Suriya Upcoming Movies,Suriya Next in Action Entertainer Film
Suriya New Movie To Be An Out And Out Action Entertainer

కోలీవుడ్ స్టార్ సూర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకవైపు ఆయన నటించిన ‘ఎన్.జి.కె’, ‘కాప్పాన్’ మూడు నెలల గ్యాప్ లో మే 31న, ఆగస్టు 30న వరుసగా విడుదల కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు… ‘గురు’ (వెంకటేష్) చిత్ర దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ దర్శకుడు శివ డైరెక్షన్ లోనూ ఓ మూవీ చేసేందుకు సూర్య అంగీకారం తెలిపాడని గత కొద్దిరోజులుగా కథనాలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని సమాచారం. ఎనిమిదేళ్ల క్రితం సూర్య తమ్ముడు కార్తీతో ‘సిరుతై’ (‘ విక్రమార్కుడు’ కి తమిళ వెర్షన్) వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన నేపథ్యంలో ఈ కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే.. అజిత్ తోనే వరుసగా నాలుగు సినిమాలు చేసి ఇప్పుడు సూర్యతో కొత్త చిత్రం చేస్తుండడం శివకి ప్రత్యేకం కానుంది. మరి… సూర్య – శివ తొలి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

[subscribe]
[youtube_video videoid=RfTNwFP6GeA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 10 =