Yయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటలీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం కొన్ని సన్నివేశాలను అక్కడే చిత్రీకరించగా… మరికొన్ని సన్నివేశాలను అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో తీర్చిదిద్దుతున్నారట. ప్రస్తుతం ఈ సెట్స్‌లోనే చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఆర్ట్ వర్క్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ సినిమా కోసం… కథ రీత్యా ఏకంగా 18 సెట్స్ ప్లాన్ చేశారని టాక్. అయితే.. ఇవన్నీ కూడా ఎంతో సహజంగా ఉంటాయని తెలుస్తోంది. ప్రముఖ కళా దర్శకుడు రవీందర్ నేతృత్వంలో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. కాగా… 2020 వేసవిలో ప్రభాస్ 20 విడుదలయ్యే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: