నేచురల్ స్టార్ నాని 25 చిత్రాల మైలురాయికి చేరువవుతున్నాడు. ఈ వేసవిలో విడుదల కానున్న `జెర్సీ` నాని 23వ సినిమా కాగా… సెట్స్ పైనున్న `గ్యాంగ్ లీడర్` 24వ చిత్రం. ఇక తన తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్న కొత్త సినిమా… సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా తెరకెక్కనుంది. ఇందులో నానిది పూర్తిస్థాయి కథానాయకుడి పాత్ర కాదు… ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. హీరోగా సుధీర్ బాబు నటిస్తుండగా… కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నాని దర్శనమివ్వనున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `వ్యూహం` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలోనే ఈ టైటిల్‌పై క్లారిటీ వస్తుంది. `దిల్` రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: