రీల్ లైఫ్‌లో జంటగా నటించి అలరించిన నాగచైతన్య, సమంత… ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా కనువిందు చేస్తున్నారు. పెళ్ళయ్యాక ఈ ఇద్దరూ కలసి నటించిన తొలి చిత్రంగా `మజిలీ` తెరపైకి రాబోతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఏడాది గ్యాప్‌లో ఈ క్యూట్ కపుల్‌కి సంబంధించి టాలీవుడ్ వేదికగా మూడు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకోవడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే… గత ఏడాది మే 9న విడుదలైన `మహానటి`లో కీలక పాత్రలో సామ్ నటించగా… అతిథి పాత్రలో చైతూ కనిపించాడు. అంటే… ఒకే సినిమాలో నటించినా ఈ జోడీకి కాంబినేషన్ సీన్స్ లేవన్నమాట. ఇక సెప్టెంబర్ 13న చైతూ `శైలజా రెడ్డి అల్లుడు`, సామ్ `యూ టర్న్` బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. అంటే… వేర్వేరు సినిమాలతో ఒకే రోజున ఈ బ్యూటిఫుల్ కపుల్ అందమైన పోటీ పడ్డారన్నమాట. కట్ చేస్తే… ఇప్పుడు ఏప్రిల్ 5న ఈ ఇద్దరూ జంటగా నటించిన `మజిలీ`తో కలసి సందడి చేయబోతున్నారు.
మొత్తమ్మీద… ఏడాది గ్యాప్‌లో మూడు ఆసక్తికరమైన అనుభూతులను (ఒకే సినిమాలో నటించినా ఒకే ఫ్రేమ్‌లో కనిపించకపోవడం, ఒకే రోజున తమ చిత్రాలతో పోటీ పడడం, కలసి నటించిన సినిమాతో పలకరించడం) ఈ నిజజీవిత దంపతులు చవిచూశారన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: