సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకూ ఉన్న మూస ధోరణి సినిమాలకు ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈసినిమాతో అప్పటికే పెళ్లి చూపులు సక్సెస్ తో ఉన్న విజయదేవరకొండ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. యూత్ ఐకాన్ గా ముద్దుగా రౌడి హీరో అంటూ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ తెరకెక్కిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగు అర్జున్ రెడ్డి, హిందీ ప్రీతి కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్నముంబైలో హిందుస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. అంతేకాదు విజయ్ కు హాటెస్ట్ స్టైలిస్ట్‌గా అవార్డు కూడా లభించింది. ఇక ఈ కార్యక్రమానికి కియారా కూడా వచ్చింది. అక్కడ కియారా అద్వాని విజయ్ తో సేల్ఫీ తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గతంలో తాను విజయ్ ఫ్యాన్ అని కియారా చెప్పిన సంగతి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబినేషన్ కూడా చూడటానికి బావుంది. ఈ ఫొటోలు చూసిన తరువాత ఎవరైనా వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ తీయడానికి రెడీ అవుతారేమో చూద్దాం…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: