టాప్ ట్రెండింగ్ మూవీస్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్

Lakshmis NTR Takes Top in Trending Movies,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV Lakshmi's NTR Movie Latest Updates,Lakshmi's NTR Movie Now on Trending,2019 Top Trending Telugu Movies,Lakshmi's NTR Beats Top Tollywood Films,Lakshmi's NTR Movie Grabs in Top Place
Lakshmis NTR Takes Top in Trending Movies

అసలు రిలీజ్ అవుతుందా? అయితే ఎప్పుడవుతుంది..? కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో డౌట్లు.. ఎన్నో అవాంతరాల మధ్య ఫైనల్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక్క ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు రెస్పాన్స్ మాత్రం బాగానే వస్తుంది. టీడీపీ వాళ్లు వర్మ చెప్పింది అబద్దం అంటుండగా.. వేరే పార్టీ వాళ్లు మాత్రం వర్మ అద్బుతంగా సినిమాను తెరకెక్కించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ మరో రికార్డు క్రియేట్ చేసింది. వర్మ పుణ్యమా అంటూ తాను చేసిన ప్రమోషన్స్ వల్ల సినిమాకు ఓ రేంజ్ లో బజ్ వచ్చింది. దీంతో ప్రముఖ ఫిలిం వెబ్‌ సైట్‌ ఐయండీబీ లో ట్రెండింగ్‌ తెలుగు మూవీస్‌ లిస్ట్‌(రియల్‌ టైం పాపులారిటీ)లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ టాప్‌ లో నిలిచింది. ఆశ్చర్యం ఏంటంటే.. 54.2% పేజ్‌ వ్యూస్‌తో బాహుబలి, అర్జున్‌ రెడ్డి లాంటి సినిమాలను కూడా వెనక్కి నెట్టి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ టాప్‌ ప్లేస్‌ సాధించింది. జాతీయ స్థాయిలో మూడో స్థాయిలో నిలిచింది. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా వెంటనే ట్వీట్ చేసి చెప్పే వర్మ.. ఈ విషయాన్ని కూడా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొత్తానికి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఓ ప్రభంజనమే సృష్టించాడుగా..

 

 


మరి ఏపీలో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? అసలు ఎన్నికలు ముందు రిలీజ్ అవుతుందో..? ఎన్నికల తరువాత రిలీజ్ అవుతుందో అన్నది మాత్రం తెలియాలంటే ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఆగాల్సిందే.

[subscribe]
[youtube_video videoid=KFQpf2_AaIA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =