రేప‌టి నుంచి `మ‌న్మ‌థుడు 2` రెగ్యుల‌ర్ షూటింగ్‌

Manmadhudu 2 Movie Shoot To Commence From Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Shooting Updates,Nagarjuna Manmadhudu 2 Movie Shooting News,Manmadhudu 2 Movie Another Shooting Schedule,Manmadhudu 2 Movie Shooting Location
Manmadhudu 2 Movie Shoot To Commence From Tomorrow

కింగ్ నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `మ‌న్మ‌థుడు`కి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా… `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైత‌న్ భ‌ర‌ద్వాజ్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్‌ని రేప‌టి (మార్చి 28) నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం. తొలి షెడ్యూల్‌లో కొన్ని కీల‌క‌ దృశ్యాల‌ను చిత్రీక‌రించి… సెకండ్ షెడ్యూల్ కోసం పోర్చుగ‌ల్‌కి షిఫ్ట్ కానుంది `మ‌న్మ‌థుడు 2` టీమ్. అక్క‌డే మేజ‌ర్ పార్ట్ షూటింగ్ జ‌రుగుతుంది. ఆపై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.