ఉద్యమ సింహం రిలీజ్ డేట్ ఫిక్స్

Udyama Simham Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Udyama Simham Movie Release Date Fixed,Udyama Simham Movie Release Date Confirmed,Udyama Simham Movie Release Date Revealed,Udyama Simham Movie Gets a Release Date,Udyama Simham Movie Release Date Unveiled,Udyama Simham Movie Latest Updates
Udyama Simham Movie Release Date Locked

కేవలం సినీ ప్రముఖుల బయోపిక్ లే కాదు.. క్రీడలు, రాజకీయాలు ఇలా పలు అంశాల్లో ప్రముఖ పాత్రలు వహించిన వారి బయోపిక్ లు సైతం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. తమిళ్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో మోడీ బయోపిక్ కూడా తెరకెక్కించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితకథ ఆధారంగా ఉద్యమ సింహం అనే టైటిల్ తో  ఆయన బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల కు ముందు ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని దర్శక,నిర్మాతలు భావించారు. షూటింగ్ పూర్తిచేసి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అన్నీ గ్రాండ్ గా నిర్వ‌హించారు కూడా. అయితే కావాలనే ఎన్నిక‌ల ముందు ఈ సినిమా రిలీజ్ ఆపేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని కనుక విడుదల చేస్తే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించే అవ‌కాశం ఉందని అప్పుడు ఆపేశారు. ఇక ఎన్నికలూ అయిపోాయాయి.. మళ్లీ కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టారు. ఆ తరువాత మార్చి 29వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా మార్చి ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్యంతో అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ బండారి.

[subscribe]

[youtube_video videoid=8JH9CfIDt9I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + thirteen =