భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ కామ్రేడ్’. విజయ్ అభిమానులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ ను నిన్న విడుదల చేశారు చిత్రయూనిట్. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. విజయ్ స్టూడెంట్ లీడర్ గా మాస్ లుక్ తో అదరగొట్టేశాడు. ఫైటింగ్ సన్నివేశంతో మొదలైన టీజర్.. విజయ్, రష్మిక ముద్దు సన్నివేశంతో ఎండ్ చేశారు. చిన్న టీజర్ తో రెండు యాంగిల్స్ చూపించారు. ఇక ‘‘కడలల్లె వేచె కనులే..’’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే సాంగ్ కూడా అభిమానులని ఆకట్టుకుంటుంది. విజయ్-రష్మిక జోడీ ‘గీతగోవిందం’ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తారన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సోషల్ మీడియాలో కూడా ఈ టీజర్ హల్ చల్ చేస్తుంది. కేవలం 24 గంటల్లో 5.5 మిలియన్ వ్యూస్, 200కె లైక్స్ తో సౌత్ ఇండియాలోనే నెం.1 గా ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో విజయ్ కు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది.
కాగా లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్ సినిమా, మైత్రీ మూవీమేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. కాకినాడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ నటిస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజులలో షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ త్వరలో కంప్లీట్ చేసి మే 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[youtube_video videoid=n3AqEHg6ofI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: