హాస్య నటుడిగా కెరీర్‌ని ఆరంభించి… కథానాయకుడిగా ఎదిగాడు సునీల్. హీరోగా ఆరంభంలో మంచి విజయాలు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్… ఆ తరువాత మాత్రం కాస్త ట్రాక్ తప్పాడు. ఈ నేపథ్యంలో… మళ్ళీ యూ టర్న్ తీసుకుని కమెడియన్‌గా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ద్వితీయార్ధంలో విడుదలైన `అరవింద సమేత వీరరాఘవ`తో విజయాన్ని అందుకున్న సునీల్… ఆ తరువాత `అమర్ అక్బర్ ఆంటొని`, `పడి పడి లేచె మనసు` చిత్రాలతో అలరించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ సంవత్సరం మాత్రం ఏకంగా ఐదు సినిమాలతో పలకరించబోతున్నాడు సునీల్. వాటిలో ముందుగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన`చిత్రలహరి` ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా… ఆ తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న `డిస్కో రాజా`, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలోనూ సందడి చేయనున్నాడు సునీల్. అంతేకాదు… రెండు మీడియం బడ్జెట్ సినిమాల్లోనూ దర్శనమివ్వనున్నాడట. మొత్తమ్మీద… పంచచిత్ర ప్రణాళికతో సునీల్ ఫుల్ బిజీగా ఉన్నాడన్నమాట.
[youtube_video videoid=NcT3Tk1e8jI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: