యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మేటి కలయికలో వస్తున్న సిసలైన మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. వారిద్దరి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కి జోడీగా ఫారిన్ భామ డైసీ నటిస్తుండగా… చరణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ దర్శనమివ్వనుంది. అలాగే… ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా… అజయ్ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… `ఆర్ ఆర్ ఆర్`లో 40 నిమిషాల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని… అందులో 30 నిమిషాల పాటు అజయ్ పాత్ర కనిపిస్తుందని టాలీవుడ్ టాక్. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=0XwacVaiMO0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: