కవచం సినిమాలో సందడి చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ మరోసారి సీత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్..ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి షాకిచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఏప్రిల్ 25 న మహర్షి సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 25 న కాకుండా.. మే 9కు పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఆ స్లాట్ ఖాళీ అవ్వడంతో తేజ ఆ డేట్ ను లాక్ చేసేసుకున్నాడు.
కాగా తేజ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా పలువురు కొత్త వాళ్లు కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి`లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` తరువాత తేజ – కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం… అందులోనూ ఈ సినిమాలో కాజల్ నెగటివ్ టచ్ క్యారెక్టర్‌లో నటిస్తుందన్న వార్తలు రావడంతో.. సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను తేజ, కాజల్, సాయి శ్రీనివాస్ రీచ్ అవుతారో? లేదో? చూద్దాం.
[youtube_video videoid=lBi8ocJHLuc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: