చందు మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ అందరికీ నచ్చేసి నిఖిల్ కు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను తీయడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. గతంలో నిఖిల్ కూడా ఈ సీక్వెల్ గురించి చెప్పాడు కానీ ఆ తరువాత దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సీక్వెల్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు స్క్రిప్ట్ తో కసరత్తులు చేసిన చందూ ఇప్పుడు ఫైనల్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినట్లు తెలిసింది. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించనున్నారట. అయితే ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. దాంతో నిఖిల్ అర్జున్ సురవరం పనులన్నీ అయిపోయిన తరువాత ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించాలన్న ప్లాన్ లో ఉన్నారట.
మరి చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. ఈ సీక్వెల్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=SEvu4A9iS5Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: