బుల్లితెర పై యాంకర్ గా తన ప్రతిభ చాటుకున్న అనసూయ… మరోపక్క వెండి తెరపై కూడా తన టాలెంట్ ను అప్పుడప్పుడూ చూపిస్తూనే ఉంది. అన్ని సినిమాలు కాకుండా చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ మంచి పేరే తెచ్చుకుంటుంది. ప్రస్తుతం తాను రాజేష్‌నాదెండ్ల దర్శకత్వంలో ప్రధాన పాత్రలో కథనం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. గతకొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మహిళా దినోత్సవం (మార్చి8) సందర్బంగా కథనం టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్ః బాలాజీ శ్రీను, ఎడిటర్ఃఎస్.బి. ఉద్దవ్, మ్యూజిక్ః సునీల్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ః కె.వి.రమణ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీః సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యూసర్ : ఎమ్.విజయ చౌదరి, నిర్మాతలుః బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వంఃరాజేష్ నాదెండ్ల.
[youtube_video videoid=aO4K_legZCY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: