రెండు దశాబ్దాలుగా కథానాయకుడిగా అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి… అలాగే దశాబ్ద కాలంగా హీరోగా ఆకట్టుకుంటున్న నేచురల్ స్టార్ నానికి… ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే… ఈ సంవత్సరం ఈ ఇద్దరూ కెరీర్‌లో 25వ చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు. అయితే… ఈ ఇద్దరి 25వ చిత్రాల విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మహేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం `రాజకుమారుడు`. ఆ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్… ఇప్పుడు మహేష్ 25వ చిత్రం `మహర్షి`కి ముగ్గురు నిర్మాతలలో ఒకరిగా వ్యవహరిస్తున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగినా… ఆసక్తికరమైన విషయమనే చెప్పాలి. ఇక నాని విషయానికి వస్తే… అతని తొలి చిత్రం `అష్టా చమ్మా`ని రూపొందించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే నాని 25వ చిత్రం కూడా తెరకెక్కనుంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్… ఈ ఏడాది చివరిలో తెరపైకి రానుంది. అంతేకాదు… అటు మహేష్ 25కి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న `దిల్`రాజు… ఇటు నాని 25కి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడని టాలీవుడ్ టాక్. అంటే… మహేష్, నాని 25వ చిత్రాల పరంగా ఇంట్రెస్టింగ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట.
కొసమెరుపు ఏమిటంటే… `నాని` పేరుతో 15 ఏళ్ళ క్రితం మహేష్ బాబు ఓ సినిమా చేస్తే… మహేష్ అనే పేరు చుట్టూ నడిచే సినిమా అయిన `అష్టా చమ్మా`తో నాని హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం.
[youtube_video videoid=r28-ORF728c]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: