మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్‌లో దాదాపు అగ్ర కథానాయకులందరికి మ్యూజికల్ హిట్స్ అందించిన ఘనత యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్‌ది. ముఖ్యంగా… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో దేవిశ్రీ ఇప్పటికే మూడు చిత్రాలకు స్వరాలు అందించగా… వాటిలో `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో `మహర్షి` చిత్రం రూపొందుతోంది. అంతేకాదు… అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటించనున్న చిత్రానికి కూడా దేవిశ్రీనే బాణీలు అందించనున్నాడని టాలీవుడ్ టాక్.
అంటే… `భరత్ అనే నేను`, `మహర్షి`, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్… ఇలా సూపర్ స్టార్ మూడు వరుస చిత్రాలకు స్వరాలందించే అవకాశాన్ని డీఎస్పీ అందుకుంటున్నాడన్నమాట. గతంలో మహేష్ కాంబినేషన్‌లో వరుసగా ఐదు చిత్రాల(వంశీ, మురారి, టక్కరిదొంగ, బాబీ, ఒక్కడు)కు మ్యూజిక్ అందించిన నేపథ్యం మెలోడీ బ్రహ్మ మణిశర్మకు మాత్రమే ఉంది. మణిశర్మ తరువాత మళ్ళీ వరుసగా మహేష్ మూడు చిత్రాలకు బాణీలు అందించే అవకాశం ఇప్పుడు డీఎస్పీ దక్కుతుండడం విశేషం. త్వరలోనే మహేష్ 26లో దేవిశ్రీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=Y-B7S8CJqrI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: