ఎంతగానో ఎదురుచూసిన ఇద్దరు సంచలన వ్యక్తుల బయోపిక్స్ ఒకే నెలలో విడుదలయ్యాయి. సంచలన రాజకీయ నాయకుడు , పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రిగా తనను తాను ప్రతిష్టించుకొన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన “యాత్ర” ఫిబ్రవరి 8న విడుదల అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు రాజకీయ చరిత్రను ఆవిష్కరిస్తూ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన “ఎన్టీఆర్ మహానాయకుడు” ఫిబ్రవరి 22న విడుదల అయింది.
‘యాత్ర’ చిత్రంలో సుదీర్ఘమైన రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్ర ను కేవలం పాదయాత్రకు మాత్రమే పరిమితం చేసి మిగిలిన అంశాలను నామమాత్రంగా టచ్ చేశారు దర్శకుడు మహి వి రాఘవ.
అలాగే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 14 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన నందమూరి తారక రామారావు పొలిటికల్ కెరీర్ లోని అతి స్వల్ప కాలాన్ని మాత్రమే ఆవిష్కరిస్తూ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు క్రిష్.
మొత్తానికి ఇద్దరు సంచలన వ్యక్తుల మీద చిత్రీకరించిన రెండు బయోపిక్ లు అసంపూర్ణగానే రూపొందాయి. ఆ అసంతృప్తి ఆ ఇద్దరు మహా నేతల అభిమానుల్లోనూ ఉంది. వాటి ఫలితాలు కూడా అలా పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. అయితే తియ్యని దాన్ని గురించి బాధపడటం కన్నా తీసినంత మేరకు ఎలా తీశారు అన్నది ముఖ్యం.
ఈ నేపథ్యంలో వారి వారి రాజకీయ జీవితాల్లోని ఒక పరిమిత భాగాలకు మాత్రమే పరిమితం అయిన యాత్ర, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలలో మీకు నచ్చిన బయోపిక్ ఏది? అని అడిగితే మీ సమాధానం ఏమిటి?
సో.. ఈ రెండు బయోపిక్స్ మీద మీ అభిప్రాయాన్ని చెప్పడానికిి ఒక చిన్న వేదికను కల్పిస్తుంది మీ” దతెలుగుఫిలింనగర్.కం”. ఈ రెండింటిలో మీకు నచ్చిన బయోపిక్ ఏదో మీ ఓటింగ్ ద్వారా మీరే నిర్ణయించండి.
[totalpoll id=”16288″]
[youtube_video videoid=6AkRqCs43zc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: