తమిళంలో ఘనవిజయం సాధించిన `జిగర్తండా` సినిమాని… `వాల్మీకి` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఒరిజినల్ వెర్షన్‌లో సిద్ధార్థ్ పోషించిన కథానాయకుడి పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఆ మధ్య… నాగశౌర్య, శ్రీ విష్ణు వంటి పేర్లు వినిపించినా… అవి వార్తలకే పరిమితమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం… ఆ పాత్రని తమిళ కథానాయకుడు అధర్వ మురళి చేయబోతున్నట్లు తెలిసింది. అధర్వ మురళి మరెవరో కాదు… తమిళ అనువాద చిత్రం `హృదయం` (1991)తో తెలుగువారికి సుపరిచితుడైన మురళి తనయుడే. త్వరలోనే అధర్వ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… అధర్వ మురళి హీరోగా నటించిన తమిళ అనువాద చిత్రం `అంజలి సి.బి.ఐ` ఈ నెల 22న రిలీజ్ కానుండగా… అధర్వ మురళి తమిళ హిట్`గణితన్`కి రీమేక్‌గా రూపొందుతున్న నిఖిల్ `అర్జున్ సురవరం` మార్చి 29న తెరపైకి రానుంది.
[youtube_video videoid=RUqzkHgOwPE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: