`బొమ్మ‌రిల్లు` ద‌ర్శ‌కుడితో అఖిల్‌?

Akhil To Work With Bommarillu Movie Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Akhil to Team Up With Bommarillu Director,Bommarillu Bhaskar Next With Akkineni Akhil,Hero Akhil Upcoming Movies in 2019,Akhil Next Project With Bommarillu Bhaskar,Akhil To Feature With Bommarillu Movie Director
Akhil To Work With Bommarillu Movie Director

ఊహ తెలియ‌ని వ‌య‌సులోనే `సిసింద్రీ`గా న‌టించి అల‌రించాడు అక్కినేని అఖిల్‌. ఆ త‌రువాత‌… అక్కినేని కుటుంబ క‌థానాయ‌కులంతా క‌ల‌సి న‌టించిన `మ‌నం`లో అతిథి పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. స్వ‌ల్ప విరామం తీసుకుని `అఖిల్‌`తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారి మూడో త‌రం క‌థానాయ‌కుడు… త‌ద‌నంత‌రం `హ‌లో`, `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాల‌తో సంద‌డి చేశాడు. అయితే… క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మూడు సినిమాల్లోనూ అఖిల్ న‌ట‌న‌కి మంచి మార్కులు ద‌క్కినా… ఆశించిన విజ‌యాలైతే ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో… త‌దుప‌రి చిత్రం విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… అఖిల్ నాలుగో చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే… ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్ నిర్మాత‌గా అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్‌. అలాగే… `బొమ్మ‌రిల్లు` ఫేమ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని… గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

[youtube_video videoid=l2KmkThwcic]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =