డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. డబుల్ ధిమాక్ ఉన్న ఓ కుర్రాడి చుట్టూ తిరిగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే… సాధారణంగా పూరి చిత్రాల్లో కథానాయకుల పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటుంటాయి. ఇంకా చెప్పాలంటే… కాస్త `తిక్క`తో ప్రవర్తిస్తుంటాయి. `ఇస్మార్ట్ శంకర్` కూడా అందుకు మినహాయింపు కాదట. ఇంకా చెప్పాలంటే… శంకర్ గాడి (కథానాయకుడి పాత్ర పేరు) తిక్క `అంతకుమించి` ఉంటుందని ఇన్‌సైడ్ సోర్స్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ `పోకిరి` స్థాయిలో ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా ఉంటుందని సమాచారం. ఇక పూరి మార్క్ పంచ్ డైలాగ్స్, కామెడీ, మాస్ మసాలా సాంగ్స్… సరేసరి. మరి… ఇన్ని కమర్షియల్ హంగులతో వస్తున్న `ఇస్మార్ట్ శంకర్`… డబుల్ దిమాకాతో ఇస్తున్న డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుందో తెలియాలంటే… ఈ వేసవి వరకు వేచి చూడాల్సిందే. మే నెలలో రానున్న `ఇస్మార్ట్ శంకర్`లో రామ్‌కి జోడీగా నిధి అగర్వాల్, నభా నటేశ్ నటిస్తుండగా… మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: