ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ రూపొందించిన `బాయ్స్` (2003) చిత్రంతో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన సిద్ధార్థ్… మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే వచ్చిన హారర్ మూవీ `గృహం`తో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు సిద్ధు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని ముందుకు సాగుతున్న సిద్ధార్థ్… తనని హీరోగా పరిచయం చేసిన శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని కోలీవుడ్ టాక్. అంతేకాదు… ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇంతకీ ఆ చిత్రమేమిటంటే… `భారతీయుడు` సీక్వెల్. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకి సిద్ధార్థ్ దాదాపుగా కన్‌ఫర్మ్ అయ్యాడని తెలుస్తోంది. త్వరలోనే సిద్ధార్థ్ ఎంట్రీపై అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా రానుందట. మరి… కథానాయకుడిగా అలరించిన సిద్ధు ప్రతినాయకుడిగానూ మెప్పిస్తాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: