సీక్వెల్ ప్లాన్ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌?

Gautham Menon plans for Sequel ??,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gautham Menon Latest News,Gautham Menon Upcoming Movie News,Gautham Menon Next Project Details
Gautham Menon plans for Sequel ??

గౌత‌మ్ మీన‌న్… ఈ పేరు విన‌గానే ప‌లు రొమాంటిక్ మూవీస్ క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడ‌తాయి. అలాగే ప‌వ‌ర్‌ఫుల్ అండ్ స్టైలిష్ కాప్ స్టోరీస్ కూడా గుర్తుకు వ‌స్తాయి. రొమాన్స్‌, యాక్ష‌న్‌ను మిక్స్ చేస్తూ… గౌత‌మ్ రూపొందించిన చిత్రాల‌లో `కాక్క కాక్క‌` (2003) అగ్ర శ్రేణిలో ఉంటుంది. సూర్య‌, జ్యోతిక జంట‌గా న‌టించిన ఈ పోలీస్ స్టోరీ… త‌మిళ‌నాట బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అలాగే… స్వ‌ర‌క‌ర్త హారిస్ జైరాజ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బ‌మ్స్‌గా నిలిచిపోయింది. ఇక‌ ఇదే సినిమా… విక్ట‌రీ వెంక‌టేష్‌, అసిన్ జంట‌గా తెలుగులో `ఘ‌ర్ష‌ణ‌` పేరుతో రీమేక్ అయి… యాక్ష‌న్ సినిమా ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… ఇప్పుడు ఈ `కాక్క కాక్క‌` సినిమాకి సీక్వెల్ చేసే దిశ‌గా గౌత‌మ్ ప్లాన్ చేస్తున్నాడ‌ని కోలీవుడ్‌ టాక్‌. ఇందులోనూ సూర్య హీరోగా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. త‌మిళ వెర్ష‌న్‌లో జ్యోతిక పాత్ర చ‌నిపోతుంది కాబ‌ట్టి… క‌థానాయిక‌గా మ‌రొక‌రిని ఎంచుకోనున్నారు. దాదాపు ప‌ద‌హారేళ్ళ త‌రువాత ప‌ట్టాలెక్కనున్న ఈ సీక్వెల్ ఘ‌న‌విజ‌యం సాధిస్తే… తెలుగులోనూ రీమేక్ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. త్వ‌ర‌లోనే `కాక్క కాక్క‌` సీక్వెల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 8 =