అక్కినేని నాగార్జున, అక్కినేని అమల… రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ సూపర్ హిట్ జోడీ. పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన అమల… ఆ మధ్య `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` (2012) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత అక్కినేని కుటుంబమంతా కలసి నటించిన `మనం` (2014)లో అతిథి పాత్ర పోషించారు. అనంతరం `హమారి అధూరి కహానీ` (2015), `కార్వాన్` (2018) వంటి హిందీ చిత్రాల్లోనూ… `కేరాఫ్ సైరా భాను` (2017) అనే మలయాళ చిత్రంలోనూ అమల కనిపించారు. కాగా… ఐదేళ్ళ తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారట అమల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… అక్కినేని నాగార్జున కథానాయకుడిగా `మన్మథుడు`కి సీక్వెల్‌గా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో… అతిథి పాత్రలో కనిపించనున్నారట అమల. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మార్చి నుంచి పట్టాలెక్కనున్న `మన్మథుడు 2` 60 రోజుల పాటు నిరవధికంగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుని… ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. మరి… అమల అతిథి పాత్రలో దర్శనమిచ్చిన `మనం` నాగ్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలచింది. అదే బాటలో `మన్మథుడు 2` కూడా వెళుతుందేమో చూడాలి.
[youtube_video videoid=ruEcJyx3c3M]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: